Abhyudaya Foundation : స్వర్గీయ జాధవ్ సకారం కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించిన అభ్యుదయ ఫౌండేషన్ సభ్యులు

TRINETHRAM NEWS

అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా ఆ పేద కుటుంబానికి 8000/- వేల రూపాయలు ఆర్థిక భరోసా అందజేత

సామాజిక సేవ కోసమే అభ్యుదయ ఫౌండేషన్ ఉంది : జాటోత్ దవిత్ కుమార్, జాధవ్ సుశీల్ కుమార్, జాధవ్ మారుతీ (సామాజిక సేవకులు లింగాపూర్ మండలం)

Trinethram News : లింగాపూర్ : నేడు ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ జాధవ్ సకారం నాయక్ (65) గత కొద్ది రోజుల క్రితం స్వర్గస్థులైనారు. బుధవారం దశదిన పెద్దకర్మ (తేర్వి) కార్యక్రమంలో అభ్యుదయ ఫౌండేషన్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ బృందం సభ్యులు పాల్గొని చిత్ర పటానికి నివాళి అర్పించారు. అభ్యుదయ ఫౌండేషన్ తరపున మృతుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ద్వారా జాధవ్ సుశీల్, జాధవ్ మారుతీ, ఆడే విష్ణు (T.A), బోడా తిరుపతి (T.A), జాధవ్ అనిల్ కుమార్ (J.P.S), ఆడే లవ్ కుమార్, డాక్టర్ రాజ శేఖర్, జాధవ్ గణేష్, ఆడే ప్రవీణ్ కుమార్ (N.R.I), జాధవ్ ప్రవీణ్ సహకారంతో……

లింగాపూర్ మండల ఇంచార్జి సభ్యులు జాటోత్ దవిత్ కుమార్ ద్వారా మృతుని సతీమణి రత్తిబాయి, కుమారులు జాధవ్ దేవిదాష్, సత్యపాల్ కి 8000/- వేల రూపాయలు నగదును అందిజేశారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్ధిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ పెద్ద మనిషి మానవీయ విలువలు ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటాయన్నారు. ప్రతి పేద కుటుంబాలకు అభ్యుదయ ఫౌండేషన్ అండగా ఉంటుందని మనోధైర్యానిచ్చారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ రమేష్, రాథోడ్ సంతోష్, జాధవ్ మారుతీ, దవనే విశ్వకాంత్, రాథోడ్ ధర్మెందర్, జాధవ్ ప్రవీణ్ కుమార్ యువకులు తదితరులు ఉన్నారు.!!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Members of Abhyudaya Foundation

You cannot copy content of this page

Scroll to Top