త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 5. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యాశాఖ నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం పండుగలా జరిగిందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. పట్టణంలోని మహాత్మా గాంధీ మునిసిపల్ హైస్కూల్ లో జరిగిన మెగా పీటీఎం 3.0 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్నారని, విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలోనే వినూత్న రీతిలో మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ఈ మార్పుల వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థినని గుర్తు చేశారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఢిల్లీ స్థాయి వరకూ వెళ్లారంటే అది ఈ హైస్కూల్ ఉపాధ్యాయుల పని తీరుకి నిదర్శనం అన్నారు. హైస్కూల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం కోరిన విధంగా సైకిల్ షెడ్డు మరియు అభివృద్ధి పనులకు చర్యలు చేపడతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మునిసిపల్ చైర్మన్ రెడ్డి సత్యనాగేంద్ర మణి, అమలాపురం టిడిపి అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, జనసేన నాయకులు కల్వకోలను తాతాజీ, ఏడిద శ్రీను, పిండి రాజా, కౌన్సిలర్ పిండి అమరావతి, దున్నాల దుర్గా, దిన్ష బాబు, పుల్లయ్య నాయుడు, బొర్రా ఈశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు గాణ సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


