జూలై 26, 2026
TRINETHRAM NEWS
Medical shops on strike

ఆన్‌లైన్ మందుల విక్రయాలకు నిరసనగా ఫార్మసిస్టుల ఆందోళన

Medical Shops on Strike : త్రినేత్రం న్యూస్ : దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ నిర్వహించనున్నట్లు ఔషధ వ్యాపార సంఘాలు ప్రకటించాయి. ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలు, ఇంటికే మందుల డెలివరీ సేవలను వ్యతిరేకిస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. దేశంలోని వేలాది ఫార్మసిస్టులు, మెడికల్ షాప్ యజమానులు ఈ నిరసనలో పాల్గొననున్నట్లు సమాచారం.

ఫార్మసీ వ్యాపారుల అభిప్రాయం ప్రకారం, ఆన్‌లైన్‌లో నియంత్రణ లేకుండా మందులు అమ్మడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందులు కూడా సులభంగా అందుబాటులోకి రావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అలాగే చిన్న చిన్న మెడికల్ షాపుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ బంద్ నేపథ్యంలో ఈ రోజు చాలా ప్రాంతాల్లో మెడికల్ షాపులు మూతపడే అవకాశం ఉంది. అత్యవసర సేవల కోసం కొన్ని దుకాణాలు మాత్రమే తెరిచి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రజలు ముందస్తుగా అవసరమైన మందులు కొనుగోలు చేసుకోవాలని ఫార్మసిస్టుల సంఘాలు సూచిస్తున్నాయి….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page