TRINETHRAM NEWS

Medchal District Collector Gautham visited the Angan Wadi Centre

తెలంగాణ ప్రభుత్వం
సమాచార పౌర సంబంధాల శాఖ

త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

అంగన్ వాడీ కేంద్రాలలోని చిన్నారులు ఆడుకుంటూ నేర్చుకునేలా పజిల్ గేమ్స్, ఆటలు ఉండేలా చూడాలని మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం అంగన్ వాడీ టీచర్లను ఆదేశించారు.
మంగళవారం దుండిగల్, బహదూర్ పల్లిలోని అంగన్ వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసారు. తనిఖీలో భాగంగా అంగన్ వాడీలను పరిశీలించి ఎంత మంది పిల్లలు ఉన్నారు, వారి ఎంత వయసు, బరువు ఉన్నారని టీచర్ ను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.

బలహీనంగా ఉన్న పిల్లల బరువు చూసి వారికి పౌష్టికాహారం తో పాటు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించి వారికి అవసరమైన మందులు అందించాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు అందించే ఆహారం , గుడ్లు కలెక్టర్ పరీక్షించారు. మెనూ చార్ట్ ప్రకారం పిల్లలకు పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ తెలిపారు. పిల్లలు కలెక్టర్ కు పువ్వులు అందించి రైమ్స్ పాడి వినిపించారు.
ఈ పర్యటనలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి, సిడిపిఓ శారద, సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Medchal District Collector Gautham visited the Angan Wadi Centre