జూలై 7, 2026

WhatsApp Image 2024 02 28 at 8.15.57 PM

TRINETHRAM NEWS

28/02/2024
తాడ్వాయి మండలం
ములుగు జిల్లా

మేడారం జాతర తిరుగువారం మొక్కులు చెల్లించినా
పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

బుధవారం శ్రీ సమ్మక్క సారమ్మ మహా జాతర తిరుగుబారం పండుగ అంగరంగ వైభవంగా గిరిజన పూజారులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుమ నిర్వహించారు. జాతర ముగిసిన అనంతరం మొదటగా వచ్చే బుధవారం రోజున తిరుగు వారం పండుగ నిర్వహిస్తారు.

పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారం మహా జాతర తిరుగువారం మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహా జాతర ముగిసిన అనంతరం కూడా మేడారం జాతరకు భక్తులు తమ భక్తులను చెల్లించుకుంటున్నారని రెండు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని తిరుగువారం పండుగతో మేడారం మహా జాతర సమాప్తం అవుతుందని అనంతరం మేడారం మహా జాతరకు సంబంధించిన చిన్న జాతరలు మొదలవుతాయని తెలిపారు. మేడారంలో నిరంతరం పారిశుధ్య పనులు నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏ ఎస్ పి సిరి శెట్టి సంకిర్త్ ,జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డి.ఎస్.పి రవీందర్, డి ఎల్ పి ఓ స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page