WhatsApp Image 2024 11 22 at 12.43.02
సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
Trinethram News : చత్తీస్ ఘడ్ : నవంబర్ 22
ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి.
ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
10 మంది మావోయిస్టులు హతం..?
మావోయిస్టులకు అడ్డాగా ఉన్న చత్తీస్ ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కాల్పులు జరిగాయి.
ఈ ఎన్‌కౌంటర్ లో పది మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. కాల్పులు జరుపుతున్న మావోయి స్టులను మట్టుబెట్టేందుకు పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
