WhatsApp Image 2024 09 19 at 19.31.35
Massive dharna in front of RG 1 GM office led by TBGKS for profit sharing
2023 24 సంవత్సరానికి సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి 35% లాభాల వాటాను కార్మిక వర్గానికి చెల్లించే తేదీని వెంటనే ప్రకటించాలని
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపుమేరకు RG 1 ఏరియా ఉపాధ్యక్షులు వడ్డెపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగినది. యూనియన్ అద్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణిలో మునిపెన్నడూ లేని విధంగా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని రికార్డు స్థాయిలో సాగించడం జరిగింది, అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం గడిచి ఆరు నెలలు కావస్తున్న వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందని మరియు లాభాలను వెంటనే ప్రకటించి అందులోంచి 35% లాభాలను వెంటనే కార్మికులకు అందజేయాలని కోరడం జరిగింది.
గతానికి భిన్నంగా ఈ సంవత్సరం ఇప్పటికి లాభాలు ప్రకటించకపోవడం వల్ల సింగరేణి కార్మిక వర్గం అయోమయానికి గురవుతుందని వెంటనే దసరా పండుగను పురస్కరించుకొని ఎప్పుడు చెల్లించే విధంగా లాభాల వాటాను ఈ నెలాఖరు వరకు ప్రకటించకపోతే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొత్తగూడెంలో మరియు హైదరాబాదులో ధర్నా నిర్వహించడానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సిద్ధంగా ఉందని అన్నారు అనంతరం జిఎం లలిత్ కుమార్ గారికి వివరణ ఇవ్వడం జరిగినది
ఈ కార్యక్రమంలో
నాయకులు నూనె కొమురయ్య మాదాసి రామ్మూర్తి ,పర్లపెల్లి రవి, చెల్పూరి సతీష్, L వెంకటేష్ చల్ల రవిందర్ రెడ్డి , పోలాడి శ్రీనివాస్రావు , దూట శేషగిరి. CH నివాస్.M రాజేశం, వాసర్ల జోసెఫ్, ఉప్పులేటి తిరుపతి, దిడ్డి లక్ష్మణ్, జనగామ మల్లేష్, కోండ్ర అంజయ్య,పులిపాక శంకర్, బొగ్గుల సాయి, రొడ్డ సంపత్ .రహమాన్, వెంకట్ రెడ్డి, సురేందర్, ఎంబడి సుదాకర్ కళాదర్, అబిషేక్, మార్క వెంకటస్వామి , భాస్కర్ , రాజు, గడ్డి శ్రీను మారుతి , బొడ్డు రవిందర్, కవిత సరోజన, విజయ,సంద్య, గుంపుల లక్ష్మి , తొకల రమేష్ , కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
