అత్యంత వెనుకబడిన మార్కాపురం
తేది:20.11.2024.ఏపీ అసెంబ్లీ.అమరావతి.
అత్యంత వెనుకబడిన మార్కాపురం తదితర ప్రాంతాల్లో ఈ బి సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో రైతుల భూముల గరిష్ట పరిమితి పది ఎకరాలకు పెంచాలి – అసెంబ్లీలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విన్నపం.
** ప్రకాశం జిల్లా.. 20.11.2024.మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి.ఏపీ అసెంబ్లీలో రైతుల పిల్లల అంశంపై ప్రభుత్వానికి విలువైన సూచన చేశారు.
ఏపీ అసెంబ్లీలో మార్కాపురం శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మార్కాపురం అత్యంత వెనుకబడిన ప్రాంతమని అదేవిధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రైతుల పిల్లలకు రెవెన్యూ విభాగం జారీ చేసే ఈబీసీ సర్టిఫికెట్లలో ఆంధ్రప్రదేశ్ అంతట ఐదు ఎకరాలకు పరిమితి చేయడంతో వెనుకబడిన ప్రాంతాల రైతుల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
మార్కాపురం ప్రాంతంలో రైతులకు ప్రతి ఎకరాకు సంవత్సరానికి 10000 మాత్రమే ఆదాయం వస్తుందని, అదే కృష్ణా డెల్టా, గోదావరి జిల్లాలలో ప్రతి ఎకరాకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వస్తుందని అన్ని ప్రాంతాలకు ఓకే నిబంధనతో వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి ఈ బీసీ సర్టిఫికెట్ల జారీలో రైతుల గరిష్ట పరిమితి రాష్టంలో వెనుకబడిన ప్రాంతాల్లో పది ఎకరాలకు పెంచాలని ప్రభుత్వానికి విలువైన సూచన చేశారు.అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఇది అమలుపరిచినట్లితే రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతాల విద్యార్థులకు లబ్ధి చేగురుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇది పరిశీలించాలని విన్నవించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App