జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 03 at 19.06.32

TRINETHRAM NEWS

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ ఓ కానిస్టేబుల్, మహిళా మావోయిస్టు దుర్మరణం.. చర్ల: తెలంగాణకు సరిహద్దు ప్రాంతమైన చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా చోటేబెథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిదూర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సుమారు గంట నుంచి భీకరంగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

హిదూర్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీస్ పార్టీ, బీఎస్ఎఫ్ బృందం ఆపరేషన్ కోసం అక్కడి వెళ్లింది. అడవుల్లో వారు గన్ ఫైర్ చేస్తుండగానే మావోయిస్టులు వారికి తారసపడ్డారు. దీంతో ముందుగా ఇరు వైపుల నుంచి ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి.

ఈ ఆపరేషన్‌లో పోలీసులతో సహా బీఎస్ఎఫ్ డీఆర్జీ దళాలు మావోయిస్టులతో పోరాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో కానిస్టేబుల్ రమేష్, ఓ మహిళా మావోయిస్టు దుర్మరణం పాలయ్యారు.

అదేవిధంగా మృతి చెందిన మావోయిస్టు నుంచి భద్రతా దళాలు కే-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్‌కౌంటర్‌ను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

You cannot copy content of this page