TRINETHRAM NEWS

ఎమ్మెల్యే,నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ….
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజక వర్గం, అనపర్తి : రెండ్రోజుల క్రితం జరిగిన మా అబ్బాయి మనోజ్ కోడలు సుమేఘల వివాహ రిసెప్షన్ వేడుకను టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు అత్యంత నిబద్దతతో, అకుంఠితమైన దీక్షతో, అవింశ్రాత శ్రమతో విజయవంతం చేసారు,

దాదాపు 60 వేల నుండి 65 వేల మంది ఆహ్వానితులు ఈ రిసెప్షన్ కి హాజరై వధూవరులను ఆశీర్వదించి ఆతిధ్యం స్వీకరించినప్పటికీ కూడా ప్రతీ ఒక్కరికీ కూడా ఆహ్వానాన్ని అందించి ఆతిధ్యం ఇవ్వడంతో బాటు ఎవరికీ ఏఇబ్బంది కలగకుండా సాగనంపిన వైనం నభూతో నభవిష్యత్,

ముఖ్యంగా నియోజకవర్గ టిిడిపి కార్యకర్తలు అత్యద్భుతంగా పనిచేయడం జరిగింది. వారితో మమేకమవుతూ జనసేన, బిజెపి కార్యకర్తలు చక్కటి సహకారం అందించడం జరిగింది. వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను,

నియోజకవర్గం నలుమూలల నుండీ పార్టీలకతీతంగా కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు వారికి కూడా నా కృతజ్ఞతలు,

నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరైన మహిళలకు తెలుగు మహిళాశక్తి టీమ్ వారు స్వాగతం పలికి, ఆతిధ్యంలో లోటు రాకుండా చూసి వారిని సాగనంపిన వైనం అత్యద్బుతం,

మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల వారు కూడా హాజరుకావడం జరిగింది

టిడిపి బిజెపి జనసేనలతో బాటు కాంగ్రెస్, వైయస్సార్ సిపి నాయకులు కూడా ఈరిసెప్షన్ కి హాజరయ్యారు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు,

ఇటీవల రాజకీయంగా నాకు క్లిష్ట పరిస్దితులు ఎదురైనపుడు ఎంతటి దీక్షతో కార్యకర్తలు నన్ను విజయ తీరాలకు చేర్చారో అదే స్ఫూర్తితో రిసెప్షన్ వేడుకకు నెల రోజులకు పైబడి శ్రమించి విజయవంతం చేసారు. వారందరి ప్రేమకు, అభిమానానికి మా కుటుంబం తరపున వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను

గ్రామాల నుండి ప్రజలు రావడానికి రవాణా సౌకర్యం కల్పించిన పెద్దలకు, సూచనలు, సలహాలతో నిరంతరం ట్రాఫిక్ పర్యవేక్షణ చేసిన పోలీసు వారికి, మెడికల్ మరియు,శానిటేషన్ సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA, Nallamilli