జూలై 7, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ అనంతగిరి ఫారెస్ట్ వాచ్ టవర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్న మృతదేహం లభ్యమైంది. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన రమేష్‌గా గుర్తించారు. హైదరాబాద్ మెహదీపట్నం నివాసి అయిన రమేష్, ఓ ప్రైవేట్ కంపెనీలో సర్వేయర్‌గా పనిచేస్తున్నాడని సమాచారం. రెండు రోజుల క్రితం బైక్‌పై వికారాబాద్ వచ్చిన రమేష్ అనంతగిరి పర్యటనకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యకు గురయ్యాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Man hanged in Ananthagiri

You cannot copy content of this page