
Free Camps : కూకట్పల్ ఆగస్ట్ 8 (త్రినేత్రం న్యూస్) : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాల వద్ద నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ( ట్రస్మా ) మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిర్రు ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. జగద్గిరిగుట్ట మగ్దుం నగర్ లోని శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో లైయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ ఆధ్వర్యంలో నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజానీకం అత్యధికంగా నివసించే జగద్గిరిగుట్ట లాంటి ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సీజన్ వ్యాధులు అత్యధికంగా ప్రబలే అవకాశం ఉన్న ప్రస్తుత వాతావరణం లో ఈ శిబిరం మరింత దోహదపడుతుందని ఆశోభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల చెందిన వైద్య బృందం విద్యార్థులకు, స్థానికులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. కార్యక్రమంలో పద్మావతి నీలంశెట్టి, లయన్ జీత్, సుబ్రహ్మణ్యం రమేష్ బాబు, నర్సిములు, భాషా, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe