CITU : కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న సమ్మె జయప్రదం చేయండి

TRINETHRAM NEWS

కామ్రేడ్ జె. మల్లికార్జున్,
CITU తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని శ్రామిక భవన్ కు సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ మల్లికార్జున్ కామ్రేడ్ భూపాల్ వచ్చిన సందర్భంగా, సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సామాజిక ఉద్యమ నిధి 38,640/- ఎస్.సి.ఇ.యు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి జిల్లా కార్యదర్శి ఎరవేల్లి ముత్యంరావు చేతుల మీదుగా రాష్ట్ర నాయకత్వానికి అందించడం జరిగింది, ఈ సందర్భంగా జె. మల్లికార్జున్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై పనిచేస్తున్న కెవిపిఎస్, సంఘం, స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలవాలని సిఐటియు రాష్ట్ర కమిటీ భావించి ఈ రాష్ట్రంలో ఏప్రిల్ మాసం అంతా సామాజిక ఉద్యమకారుల వర్దంతులు జయంతుల సందర్భంగా, పెద్ద ఎత్తున కార్మిక వర్గంలో సామాజిక సంఘీభావ ఉద్యమ నిధి సేకరించాలని పిలుపునివ్వడంతో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కమిటీ పెద్ద ఎత్తున 38,640/- సేకరించి రాష్ట్ర కమిటీకి అందించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం

ఈ దేశంలో కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పెట్టుబడుదారులకు అనుకూలంగా 2025 ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భారతదేశంలోని కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు మే 20న పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించిందని ఈ సమ్మెలో భారతదేశ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొంటుందన్నారు, తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా ఉన్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తూ బొగ్గు బ్లాక్ లను పెట్టుబడిదారులకు ఈ వేలంతో అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే కనీస వేతనం నిర్ణయంలో జాప్యం చేస్తున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26 వేల రూపాయలు నిర్ణయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అందుకే ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై, కార్మిక చట్టాలు హక్కుల రక్షణ కోసం, మే 20న జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు,
భూపాల్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు,
తుమ్మల రాజారెడ్డి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, వేల్పుల కుమారస్వామి సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎరవెల్లి ముత్యంరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి, సిఐటియు జిల్లా నాయకులు మెండే శ్రీనివాస్,ఎన్, బిక్షపతి, ఎం, రామాచారి, ఎంఏ గౌస్, తదితరులు పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make the strike on May

You cannot copy content of this page

Scroll to Top