WhatsApp Image 2024 10 02 at 13.54.44
Mahatma Gandhi and Lal Bahadur Shastri birth anniversary celebrations at NCP party office
గోదావరిఖని త్రినేత్రంలో ప్రతినిధి
గోదావరిఖని పట్టణంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఎన్సీపీ పార్టీ యువజన నాయకులు మొలుగూరి మహేష్ ఆధ్వర్యంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ మరియు భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి, లాల్ బహదూర్ శాస్త్రి ల చిత్రపటానికి పూల మాలలు వేసి, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వారు చేసిన సేవలను స్మరించు కున్నారు.
ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ ” భారత దేశ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరూ అహింసా మార్గంలో నడవాలని, భారత దేశ మొదటి రైల్వే శాఖ మతమంత్రి , మాజీ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జైజవాన్ జైకిసాన్ అనేది ఇప్పటికి మనందరం పాటించాలని, రామగుండం కార్పోరేషన్ ఏరియాలో భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి, భవిష్యత్తు తరాలకు వారు చేసిన త్యాగాలు, వారి పోరాటాలు తెలిసే అవకాశం ఉంటుందని , కాబట్టి రామగుండం నగర మేయర్, కమీషనర్ లకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ” అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర, జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, యువజన నాయకులు మొలుగూరి మహేష్, విద్యార్థి నాయకులు నాగుల శివకుమార్, కుమ్మరి నాగార్జున, పొడిషెట్టి మణిదీప్, సదానందం గౌడ్, భాస్కర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “Mahatma Gandhi : ఎన్సీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి వేడుకలు”
Comments are closed.