TRINETHRAM NEWS

‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా

Trinethram News : ప్రయాగరాజ్: కులమతాలకు అతీతంగా ప్రజలందర్నీ ఏకం చేసే మహా యజ్ఞమే కుంభమేళా (Kumbhamela) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ”ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం” అనే సందేశాన్ని సంగమ స్నానం ద్వారా దేశవాసులు చాటుతారని అన్నారు..

ఎంతరెందరో సాధువులు, సన్యాసులు, రుషులు, పండితులు, సాధారణ ప్రజానీకం కలిసికట్టుగా మూడు నదుల సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని, కులాల మధ్య అంతరాయాలు, మత ఘర్షణలు ఇక్కడ మటుమాయమవుతాయని చెప్పారు. మహాకుంభమేళా ద్వారా దేశానికి, సమాజానికి సానుకూల సంకేతాలు వెళ్తాయన్నారు. ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమం (గంగ-యమున-సరస్వతి కలిసే చోటు)లో శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధాని అనంతరం జరిగిన ‘మహాకుంభ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App