Handcuffs : పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. పల్నాడులో చిత్ర విచిత్రాలు

TRINETHRAM NEWS

స్టేషన్ కు బేడీలు వేసిన పోలీసులు-పల్నాడులో విచిత్రం చూశారా ?

Trinethram News : ఏపీ పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఓ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులకు..

ఆమెను చూసేందుకు వస్తున్న సదరు పార్టీ నాయకులను ఎలా అడ్డుకోవాలో తెలియలేదు. దీంతో ఆమెకు వేయాల్సిన బేడీల్ని కాస్తా ఏకంగా పోలీసు స్టేషన్ గేట్లకే వేసారు. దీంతో ఈ వ్యవహారం పల్నాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా, టీడీపీ, ఇతర కూటమి పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్త పాలేటి కృష్ణవేణిని పల్నాడు పోలీసులు నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మందకృష్ణ మాదిగ భేటీ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదం కావడంతో దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసిన పోలీసులు.. నిన్న రాత్రి దాచేపల్లికి తీసుకొచ్చారు. ఆమెను ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఆలోపు పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసిన సమాచారంతో వైసీపీ నాయకులు దాచేపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ ఆమెను కలిసేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసులు మాత్రం వారిని ఆమెను కలిసేందుకు అనుమతి లేదని చెప్పేశారు. అయినా వారు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఏకంగా స్టేషన్ కు ఖైదీలకు వేసే బేడీలు వేసినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు వచ్చిపోయే ప్రభుత్వ కార్యాలయమైన పోలీసు స్టేషన్ కు ఇలా బేడీలు వేయడం ఏంటనే చర్చ జరుగుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Handcuffs at the police station

You cannot copy content of this page

Scroll to Top