WhatsApp Image 2024 06 15 at 1.27.51 PM
Sports are important for physical and mental well-being : Madhuyashki Goud
ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 6వ గురు హనుమాన్ కేసరి చాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమానికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మధుయాష్కి గౌడ్ శుక్రవారం సాయంత్రం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అక్కడ నిర్వహించిన కుస్తీ పోటీలను ఆయన తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా యువత మధ్య మంచి స్నేహ బంధానికి క్రీడలు దోహదపడతాయన్నారు.
గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ప్రయత్నించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి ఉస్మాన్, యూత్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శివసేన రెడ్డి, మెట్టు సాయి, నిర్వాహకులు శ్రీధర్ (లడ్డు ) తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
