త్రినేత్రం న్యూస్ ధర్మసాగర్ డిసెంబర్ 22: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా మాచర్ల జ్యోతి ఏలియా సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెతో పాటు ఉప సర్పంచ్ కొంతం కొమ్మురమ్మ మరియు 14 మంది వార్డు సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ అట్టహాస కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఎంపీ కడియం కావ్య శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ధర్మసాగర్ అభివృద్ధికి ఎం ఎల్ ఏ కడియం శ్రీహరి తో పాటు తన వంతు పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు మాచర్ల జ్యోతి
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో తాగునీరు పారిశుధ్యం రహదారులు మరియు వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు విద్య ఆరోగ్య రంగాల బలోపేతంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులకు అందేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


