Job Security : ఎం.ఎల్. హెచ్.పి లకు ఉద్యోగ భద్రత కల్పించి రూ. 44 వేల వేతనం ఇవ్వాలి

TRINETHRAM NEWS

ఏఐటీయూసీ లో చేరిన MLHP ఉద్యోగులు
ఎన్. హెచ్. ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
భువనగిరి జిల్లా మార్చి-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నేషనల్ హెల్త్ మిషన్ స్కీo లో గత మూడు సంవత్సరాల నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో ప్రజా నీకానికి వైద్య సేవలు అందిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎం.ఎల్. హెచ్ .పి.)లకు రూ. 44 వేల వేతనం తోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాలని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం రోజున మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమావేశం రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో బి. విజయ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి రామ రాజేష్ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు అమలు చేయకుండా అతి తక్కువ జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. డ్యూటీ చార్ట్ ప్రకారం విధులు చేయించకుండా అనేక రకాల క్రింది స్థాయి పనులను వారిపై రుద్దుతూ పని భారాన్ని పెంచటం అన్యాయమని ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బిఎస్సి నర్సింగ్, జనరల్ నర్సింగ్, విద్యార్హతతో, డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక చేయబడినటువంటి ఎం. ఎల్ హెచ్. పి ఉద్యోగులకు కనీస వేతనం రూ.44వేలు ఇవ్వవ లసి ఉండగా కేవలం 29 వేల జీతం మాత్రమే చెల్లిస్తూ అధిక పనిభారాన్ని వారిపై మోపుతూ అన్ని స్థాయిలో పనులు వారితో చేయించుకోవడం అన్యాయమన్నారు.

ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ ఎఐటి యూసి అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుం దని తెలియజేశారు. ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న మాదిరి మన రాష్ట్రంలో కూడా ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదు శాతం పర్ఫా ర్మెన్స్ బేసిడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాధ్యక్షులుగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, అధ్యక్షులుగా బి. విజయ, ఉపాధ్యక్షులుగా చైతన్య, లావణ్య, ప్రధాన కార్యదర్శి ఎం. జోష్నా సహాయ కార్యదర్శి గా అనూష అన్నపూర్ణ కోశాధికారిగా జ్యోతి, ముఖ్య సలహాదారులుగా బానోతు నెహ్రు నాయక్, సలహాదారులుగా గోరేటి రాములు, సామల శోభన్ బాబు తదితరులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ సి యు సుజాత, మత్స్యగిరి, సుధాకర్, విజయ రాములు కృష్ణ అండాలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

M.L. Providing job security

You cannot copy content of this page

Scroll to Top