Vampuru Gangulayya : లోతు గెడ్డ గ్రామ యువత పెద్ద ఎత్తున జనసేనలో చేరిక, వంపూరు గంగులయ్య నేతృత్వంలో సమావేశం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ మే 15: అల్లూరి జిల్లాలోని చింతపల్లి మండలానికి చెందిన లోతు గెడ్డ గ్రామ యువత, నాయకత్వం వహిస్తున్న రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ప్రజానీకం జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం చింతపల్లి మండలంలోని పెదబరడ పంచాయతీ లోతు గెడ్డ గ్రామంలో నిర్వహించబడింది. జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఉల్లి సీతారామ్, సీనియర్ నాయకులు ఉగ్రంగి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వంపూరు గంగులయ్య మాట్లాడుతూ, “రాజకీయ చైతన్యంతో ముందుకు సాగుతున్న గిరిజన యువత కారణంగా జనసేన పార్టీ గిరిజన ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి, దుర్నీతి, నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా వస్తున్న గళమే దీనికి నిదర్శనం,” అని విమర్శించారు.
గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 3 వల్ల గిరిజన నిరుద్యోగ యువతకు జరిగిన నష్టం గురించి ఆయన ప్రస్తావిస్తూ, “వైసీపీ నేతలు చేసింది కుటిల రాజకీయాలే. ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడే గిరిజన అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడారు. వైసీపీ గిరిజన నాయకులు తమ జీతాల కోసమే మాజీ సీఎం జగన్‌కి బానిసత్వం చేస్తూ గిరిజనుల మోసానికి పాల్పడ్డారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో వైసీపీ నుండి రామకృష్ణ నేతృత్వంలోని సుమారు 100 మంది గ్రామస్థులు, యువత జనసేన పార్టీలోకి చేరారు. వంపూరు గంగులయ్య చేతుల మీదుగా జనసేన కండువాలు కప్పుకొని పార్టీకి తమ మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల జనసేన అధ్యక్షులు మాసాడి భీమన్న, ఐటీ విభాగం ఇంచార్జ్ అశోక్, చిన్ని రాజబాబు, మర్రి నాగేష్, మఠం శ్రీను, కూడా అబ్బాయి దొర, తల్లే త్రిమూర్తులు మూర్తి, ముదిలి సుబ్బు, సత్యనారాయణ మజ్జి తదితర జనసైనికులు, మహిళా శ్రేణులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lot Gedda village youth

You cannot copy content of this page

Scroll to Top