WhatsApp Image 2024 02 27 at 20.52.49
ధరూర్ నుంచి పాదయాత్ర…
శ్రీశైల దేవస్థానం గురువారం శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భక్తుల సౌకర్యార్థం జ్యోతిర్ముడి సమర్పించేందు గాను మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోని శివస్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు.మార్చి 08 మహాశివరాత్రి సందర్భంగా మండలదీక్ష,అర్ధమండల దీక్ష స్వీకరించిన భక్తులు ఈ దీక్షావిరమణ సమయంలో జ్యోతిర్ముడిని సమర్పిస్తారు…మంగళవారం తెల్లవారుజామున శివుడికి అభిషేకాలు నిర్వహించి,అనంతరం జ్యోతిర్ముడి వేసుకొని,మండల కేంద్రం నుంచి 15 మంది పాదయాత్రగా బయలుదేరగా,కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి శివస్వాములు మరియు భక్తులు దాదాపు 100 మంది పాదయాత్రగా బయలుదేరారు….వీరిని గ్రామంలోని పలు దేవాలయాలకు ఊరేగింపుగా తిరిగి పూజలు నిర్వహించారు…
