TRINETHRAM NEWS

అడ్వకేట్లను సత్కరించిన లయన్స్ క్లబ్…

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాతీయ అడ్వకేట్స్ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఖని సీనియర్ అడ్వకేట్లను సత్కరించారు.
అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ ఎల్లప్ప, ట్రెజరర్ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్లు కొత్త కాపు సుధాకర్ రెడ్డి, సంజయ్ కుమార్, బల్మూరి అమరేందర్ రావు లను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్ సభ్యులు కె రాజేందర్, మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి, తిలక్ చక్రవర్తి, మనోజ్ కుమార్ అగర్వాల్, ముడతనపల్లి సారయ్య, కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App