భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. త్రినేత్రం న్యూస్ .. అశ్వారావుపేట మండలం ది : 05-03-2025
ఎర్ర అక్కలూ దండు కదిలింది... CPI ( ML) MASS LINE -
మహిళలపై జరుగుతున్న దాడులకు
వ్యతిరేకంగా పోరాడుదాం…..
ప్రగతి శీల మహిళ సంఘం ( POW )
పిలుపు….
ది : 05-03-2025 బుధవారం రోజున భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట పట్టణంలో అరుణోదయ కళాకారుల బృందంతో ప్రగతి శీల మహిళ సంఘం పి ఓ డబ్ల్యు ఆధ్యర్యంలో బారి ర్యాలీ నిర్వహించి సి పి ఐ యంఎల్ – మాస్ లైన్ ప్రజాపంథా కార్యాలయంలో కంగాల వీరమ్మ అధ్యక్షతన సదస్సు జరిగింది.
ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతున్న పి ఓ డబ్ల్యు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కార్యదర్శి రాలు కేచ్చల కల్పన పి ఓ డబ్ల్యు మండల కార్యదర్శి రాలు కంగాల భూలక్మి పి ఓ డబ్ల్యు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా నాయకురాలు గోకినెపల్లి గంగ సి పి ఐ యంఎల్ – మాస్ లైన్ ప్రజాపంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినెపల్లి ప్రభాకర్ లు మాట్లాడుతూ మార్చి 8 న కొత్త గూడెంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ…
స్త్రీ పురుష సమానత్వ హక్కులు కల్పించాలని పరువు హత్యలను అరికట్టాలని మాట్లాడుతూ….
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మహిళ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని అన్నారు. రోజు రోజుకు మహిళల పైన దాడులు దేశవ్యాప్తంగా తీవ్రతరం అవుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అప్పటినుండి అనేక మణిపూర్ లాంటి ఘటనలను సృష్టించింది. పరువు హత్యల పేరుతోటి ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా మహిళలను , పురుషులను చంపుతున్నారు.
స్త్రీ పురుష సమానత్వం నేటికీ సాధించలేక పోతున్నాం. అని రంగాలలో మహిళలు రాణిస్తున్న వివక్ష మాత్రం కొనసాగుతునే ఉంది. వీటికి వ్యతిరేకంగా మహిళ లోకం పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయింది. అని గొప్పలు చెప్పుకొంటున్న మహిళల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఉంది. 13 నిమిషాలకు ఒక మహిళ మారణ వార్త వినే పరిస్థితి దేశంలో ఉంది. అందుకే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ,పురుష సమానత్వంకై , మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేంతవరకు మహిళలంతా కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిస్తూ… వారు మాట్లాడినారు.
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు మండల నాయకురాలు కొమరం చిన్న లక్ష్మి పూసం శారద కంగాల సైదమ్మ కుంజా లక్ష్మి బాడిస భూదేవి కొమరం సింగమ్మ మడివి వెంకటలక్ష్మి పిట్ట వెంకమ్మ మడివి లక్ష్మి కోడిమ్మి పార్వతి సున్నం కాంతమ్మ కొమరం సావిత్రి కేరం లక్ష్మి మడకం కృష్ణవేణి మడకం వెంకటలక్ష్మి కారం నీలిమ కుంజా మంగ పూనెం దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


