Former Minister Kothapalli : పర్యటన ను విజయవంతం చేద్దాం

TRINETHRAM NEWS

తేదీ : 28/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి అమరావతి పనులు ప్రారంభించేందుకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొత్తపల్లి. జవహర్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము పేర్కొన్నారు.
పునర్నిర్మాణ పనుల ప్రారంభంలో భాగంగా మే నెల రెండో తేదీన జరిగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా గుడివాడ, ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో ఎమ్మెల్యే రాము, ఆధ్వర్యంలో సాయంత్రం కూటమి పార్టీల ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో శాసనసభ్యులు రాము, మాజీమంత్రి కొత్తపల్లి . శా మ్యూల్ జవహర్ పాల్గొని కూటమి నేతలకు సభా నిర్వహణ ఏర్పాట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా పెద్ద ఎత్తున సభ జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వామ్యం అవుదామని పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టిడిపి పరిశీలికరాలు నూకాలమ్మ యాదవ్, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ .శ్రీకాంత్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సాయన .పుష్పావతి, సీనియర్ టిడిపి నాయకులు, పిన్నమనేని. బాబ్జి టిడిపి అధ్యక్షులు డి. రాంబాబు, జిల్లా బిజెపి నాయకులు అంగడాల .సతీష్, జనసేన అధ్యక్షులు అడుసుమిల్లి. చిట్టిబాబు. కొడాలి. రామరాజు, చాట్రగడ్డ. రవి, కంచర్ల. సుధాకర్, లింగం. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's make the visit

You cannot copy content of this page

Scroll to Top