WhatsApp Image 2024 11 03 at 20.12.52
సోషలిస్టు సమాజంకై పోరాడుదాం, అమరుల త్యాగాలను ఎత్తి పడదాం.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భూమి భక్తి ఈ దేశ విముక్తి కోసం పోరాడి అమరులైన వీరులను స్మరించుకుంటూ నవంబర్ 1 నుంచి 9 వరకు సంస్మరణ సభలు జరపమని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగాతేది 03:10:2024 నాడు రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న అమరుడు కత్తేరమల్ల పోచన్న స్మారక స్థూపం వద్ద
జరిగిన సభకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కామ్రేడ్ గూడూరి వైకుంఠం అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ అమరవీరులు చూపిన బాటలో పయనిస్తూ ఎర్రజెండాను మరింత ఎరుపెక్కి విధంగా మనమందరం పనిచేయాలని అలా పని చేసినప్పుడే మనం అమరవీరులకు ఇచ్చే గౌరవం అని అన్నారు.
అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు ఉదృతం చేయాల్సిన సమయం వచ్చిందని వారి ఆశయ సాధన కోసం నిరంతరం విప్లవ బాటలో పేదల రాజ్యం కోసం పోరాటం చేయడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని వారన్నారు. అమరుల ఆశయ సాధన కోసం మనమందరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ , అంతర్గాం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న జిల్లా నాయకులు గూడూరి వైకుంఠం,మార్త రాములు గొల్లపల్లి చంద్రయ్య తీగుట్ల రాములు, పెండ్యాల ఓదెలు, కలువల రాయమల్లు,గుండ్ల పోశం తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
