WhatsApp Image 2024 03 15 at 14.36.36
Trinethram News : 15-03-2024
ఎచ్చెర్ల నియోజకవర్గం
లావేరు మండలం
తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు ఉమ్మడిగా చిలకలూరిపేటలో ఈ నెల 17 నిర్వహించనున్న సభలో పాల్గొనేందుకు జనం భారీ స్థాయిలో తరలి రావాలని , తద్వారా ఇదే సభను విజయవంతం చేయాలని ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్ గౌరవ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. చిలకలూరిపేటలో నిర్వహించే ఉమ్మడి సభను విజయవంతం చేయాలని కోరుతూ.. శుక్రవారం ఉదయం మురపాక గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ యాత్రలో అప్పలనాయుడు పాల్గొన్నారు. బీజేపీ పార్టీతో పొత్తు కుదిరిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు నిర్వహించే ఉమ్మడి సభలో భారీ ఎత్తున జనం పాల్గొని , ఇదే ఉమ్మడి సభను విజయవంతం చేయాలని అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. తొలుత *మురపాక గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్దకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు
