కూకట్పల్లి జనవరి 7 (త్రినేత్రం న్యూస్) : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తిమ్మప్పను కూకట్పల్లి జర్నలిస్టులు నాగరాజ్ యాదవ్, మహేందర్ నాయక్, శ్రావణ్ లు మర్యాదపూర్వకంగా శాలువ తో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ట్రాఫిక్ నియంత్రణలో ఆయన అందిస్తున్న సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, కూకట్పల్లి పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సిఐ తిమ్మప్ప తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నయని పేర్కొన్నారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, క్రమశిక్షణతో ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నారని తెలిపారు. అనంతరం సిఐ తిమ్మప్ప ప్రజల సహకారంతో ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


