కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 13 : ఈరోజు ఖైరతాబాద్ లొ గల బిసి కమిషనర్ ఆఫీస్ లో కమిషనర్ ని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాల వారిని తిరిగి బీసీ జాబితాలో చేర్చవలసిందిగా బీసీ కమిషనర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా కోరుకుంటూ కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ 14.08.2014 జి ఓ ఎం ఎస్ నెంబర్ : 3 ద్వారా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26 కులాలను బీసీ జాబితాలో నుండి తొలగించడం జరిగినది. ఈ 26 కులాల వారు ఆర్థికంగా వెనుకబడినవారు, విరిలో ఆటో రిక్షా కార్మికులుగ, హమాలిలుగ, నిర్మాణ రంగ కార్మికులుగ,వీధి వ్యాపారులుగ వివిధ వృత్తులతో జీవనం సాగిస్తున్నారని, బీసీ జాబితా నుండి తొలగించడం వల్ల వీరికి ఆర్థిక ఉపాధి, ఉద్యోగాలు, పిల్లలకు విద్యా అవకాశాలు కోల్పోయి గత 11వ సంవత్సరాలుగా వీరికి అన్యాయం జరిగిందనీ ప్రస్తుతం 26 కులాలు వారు నిస్సహాయులై దయనీయ స్థితిలో ఉన్నారని , కావున వీరిని తిరిగి బిసి కులాల జాబితాలో చేర్చవలసిందిగా , బీసీ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు తొలగించిన 26 కులాలకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున కోరుచున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్,నాగేంద్ర, కలిగినీడి ప్రసాద్, అడబాల షణ్ముఖ ,పోలిబోయిన శ్రీనివాస్ ,మాధవ్ పులగం సుబ్బు ,పుష్పలత ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


