‘Yesudas’ Birthday : కూకట్‌పల్లిలో ఘనంగా ‘ ఏసుదాస్ జన్మదినం సందర్భంగా సంగీత స్వరసంద్రం

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 11 (త్రినేత్రం న్యూస్) : ప్రముఖ గాయకుడు, గానగంధర్వుడు కె.జె. ఏసుదాసు జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కూకట్‌పల్లిలో నిర్వహించిన ‘స్వరరాగ గంగా ప్రవాహమే’ పాటల కార్యక్రమం శ్రోతలను అలరించింది.

అను సిస్టర్స్ , శ్రీ సుమధుర ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా,ఈ కార్యక్రమానికి సంతోష్ వేలు, వెంకట కిషన్ రావు, బీజేపీ నాయకుడు కె. దుర్గాప్రసాద్, ఎల్లం నాయుడు, నాగేశ్వరరావు, నర్సింగ్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏసుదాసు తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఏసుదాసు గతంలో పలు సినిమాల్లో పాడిన చిరస్మరణీయ గీతాలను గాయనీగాయకులు ఆలపించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో గాయకులు పి. అనురాధ, కె. శ్రీదేవి, వి. రేవతి, భీంరావు, కృష్ణ ప్రసాద్, శశికుమార్, మూర్తి వేదుల,మాన్సింగ్, కాశీ , శ్రీశైలం, సబిత, ప్రేమ్ సాగర్, తదితరులు తమ గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో ఏసుదాసు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kukatpally celebrates ‘Yesudas’ birthday with musical gamut

You cannot copy content of this page

Scroll to Top