District Laws : తక్షశిల డిగ్రీ కళాశాలలోజిల్లా న్యాయ చట్టాలపై అవగాహన

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డి బి శీతల్ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తక్షశిల డిగ్రీ కళాశాలలొ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ డి.బి. శీతల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేటితరం యువత ఎలాంటి తప్పుడు దారులలో వెళ్తున్నారనే విషయాల గురించి మరియు మాదకద్రవ్యాల వినియోగానికి ఎలా దూరంగా ఉండాలి అనే విషయాల గురించి మాదకద్రవ్యాలు వినియోగించడం వలన కలిగే నష్టాలను గురించి వివరించారు.

సమాజంలో యువత పాత్ర ప్రాముఖ్యత గురించి, వాహనాలు నడిపే యువకులు కచ్చితంగా చట్టంలోని నిబంధనలు పాటించాలని వివరించారు, కళాశాలలో ఎవరు కూడా ర్యాగింగ్ చేయకూడదని అందుకు సంబంధించిన చట్టాలు కఠిన శిక్షలు విధిస్తాయని వివరించారు, చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వలన మన వలన జరిగే తప్పులను సరిదిద్దుకొని సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మెలుగవచ్చునని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. వెంకటేష్ అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపల్ మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Laws in Taxila Degree

You cannot copy content of this page

Scroll to Top