WhatsApp Image 2024 09 17 at 17.33.51
Khairatabad Maha Ganapati Ki Ta..Ta.. Boy.. Boy
Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 17
ఖైరతాబాద్ మహా గణపతి నిమర్జనం ప్రక్రియ ఈరోజు ఉదయం ప్రారంభమై మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంది. భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. 4వ క్రేన్ దగ్గర 70 అడుగుల ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. దీంతో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన క్రతువు వైభవంగా సాగింది.
70 అడుగుల భారీ మహా గణనాథుని విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత, డీజేల కోలాహలమైన సంగీతం మధ్య ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
