TRINETHRAM NEWS

KCR’s “Kalyana Lakshmi” scheme….a boon for every poor girl child: MLA K.P. Vivekanand

Trinethram News : ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ దేవేందర్ నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన “కల్యాణ లక్ష్మి & షాదీ ముబారక్” చెక్కల పంపిణీ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై 341 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోని ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కాకూడదని మెట్టినింట గౌరవాన్ని పొందాలనే ఆలోచనతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో నా భూతో… నా భవిష్యత్…. అనే విధంగా ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ పథకాలని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అబ్దుల్ రహమాన్ ఖాన్, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్ రావు, కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, ఆర్.ఐ లు రజనీకాంత్, రేణుక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KCR's "Kalyana Lakshmi" scheme....a boon for every poor girl child: MLA K.P. Vivekanand