TRINETHRAM NEWS

కాంగ్రెస్ ప్రభుత్వంలో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ మరియు కెసిఆర్ కిట్ బంద్: మెతుకు ఆనంద్

ఈరోజు వికారాబాద్ పట్టణంలోని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఈ సందర్బంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు అవి

కెసిఆర్ ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు సెంట్రల్ డ్రగ్ స్టోర్ ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరు చేయించడం జరిగింది, కానీ ఈరోజు వికారాబాద్ ప్రభుత్వాసుపత్రి లోని డయాలసిస్ సెంటర్ ని, డయాగ్నస్టిక్స్ సెంటర్ ని, బ్లడ్ బ్యాంకు ని సందర్శించి OP పేషెంట్లను కూడా అడిగితే గత నాలుగు నెలలుగా బ్లడ్ బ్యాంకు లోని ఫ్రిడ్జ్ పనిచేయడం లేదని తెలిసింది.

బ్లడ్ క్యాంపులు పెట్టి బ్లడ్ సేకరించటానికి పరికరాలు సరిగ్గా పనిచేయడం లేవని తెలిసింది.

KCR ప్రభుత్వ హయాంలో రోగులందరికీ దాదాపుగా 100 రకాల పరీక్షలు ఉచితంగా చేయడానికి డయాగ్నస్టిక్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది.

రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 8 ప్రైమరీహెల్త్ సెంటర్ లు మరియు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన 32 మొత్తం 40 ప్రైమరీ హెల్త్ సెంటర్లని అనుసంధానం చేయడం జరిగింది.

ఈ 40 ప్రైమరీ హెల్త్ సెంటర్లకు సంబంధించి రోగులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వాహనాలను పెట్టి మరీ, నమూనాలు సేకరించి, సేకరించిన నమూనాలకు సంబంధించిన పరీక్ష రిపోర్టులను తిరిగి అదే ప్రైమరీ హెల్త్ సెంటర్ కి చేరేలా చూడడం జరిగింది.

కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే, మిషన్లు పనిచేయడం లేదు, వాటిని పట్టించుకునే నాథుడు లేడు, అధికారుల పర్యవేక్షణ లోపించింది.

బ్లడ్ శాంపిల్స్ తీసుకొని 12 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ రిపోర్ట్ లు అందడం లేదని పేషెంట్లు వాపోతున్న పరిస్థితి పలు పత్రిక కథనాలు సైతం వెల్లడిస్తున్నాయి.

దీంతో పేషెంట్లు ప్రైవేటు ఆసుపత్రిలకి వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.

కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా గర్భవతుల& బాలింతల సంరక్షణ కోసం ప్రభుత్వ వాహనాలు పెట్టి ఇంటి నుండి ఆసుపత్రి కి తీసుకు వచ్చి, అవసరం అయినా అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, తిరిగి వారిని ఇంటి దగ్గర దింపేది. కానీ ఇప్పుడు వారు సొంత డబ్బులతో ప్రైవేట్ వాహనాల్లో రావలసిన భారం ఏర్పడింది.

కెసిఆర్ సీఎంగా ఉన్నప్పుడు గర్భవతులకి కెసిఆర్ న్యూట్రిషన్ కిట్, అలాగే తల్లి బిడ్డ సంరక్షణ కోసం కెసిఆర్ కిట్ అందించి వారి ఆరోగ్యం మీద ద్రుష్టి సారించారు. కానీ ఎంతో అవసరం అయినా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ మరియు కెసిఆర్ కిట్ అందించటం లేదు.

డాక్టర్లు మందులు బయటికి రాసిస్తున్నారని పేషెంట్లు వాపోతున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఇక్కడ ఉండగా మందులు బయటకు రాయాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది? మందులు రావడం లేదా ఒకవేళ వస్తే పేషెంట్లకు అందడం లేదా?

స్కానింగ్ బయటకు రాస్తున్నారని పేషెంట్లు చెప్తున్నారు, ఇక్కడ వస్తున్న పేషెంట్లు చాలామంది పేదవారు ఉంటారు కాబట్టి ప్రభుత్వం దీని మీద ద్రుష్టి పెట్టకపోవడం దురదృష్టకరం.

ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు సైతం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లోని లోపాలను ఎత్తిచూపుతుంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికైనా సీఎం వీటి మీద దృష్టి పెట్టి రోగులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలుగకుండా చూడాలని ప్రధాన ప్రతిపక్షంగా, ప్రజల పక్షాన తెలియజేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, రామస్వామి, సీనియర్ నాయకులు గంగారం వెంకట్, బూరుగుపల్లి శ్రీనివాస్ రెడ్డి, ధారూర్ మండల BRS పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ మండలం మైనారిటీ సెల్ అధ్యక్షులు గయాజ్, వికారాబాద్ పట్టణ మైనారిటీ జనరల్ సెక్రటరీ MD అఫ్జల్ పాషా (షకీల్), యువజన విభాగం అధ్యక్షులు గిరీష్ కొఠారి, జైపాల్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, మల్లేష్, నాయకులు గాండ్ల మల్లికార్జున్, మంచన్ పల్లి సురేష్, సుభాన్ రెడ్డి, గోపి, సంగమేష్, దత్తు, మల్లేష్, రమణ, సురేష్ గౌడ్, పడిగల్ల అశోక్, సుభాష్, ప్రభాకర్ రెడ్డి, అల్లపురం శ్రీనివాస్, మహిపాల్ నాయక్, నర్సింహా, రాజు, మర్పల్లి జైపాల్, వెంకటాపూర్ తండా శ్రీను, సత్యనారాయణ, కిషోర్, సోను రాథోడ్, సిద్దులూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App