TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మార్గదర్శకుడు రాష్ట్ర అభివృద్ధికి అంకిత మైన నాయకుడు గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధికి కేసిఆర్ చేసిన కృషి ని గుండెల్లో పెట్టుకున్న ప్రతి కార్యకర్త అభిమాని ప్రధానికం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించారు. ఈ సేవా కార్యక్రమం కెసిఆర్ దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ సమాచారం మంచి మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

పోరాట గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు స్వరాష్ట్రం సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు, సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా మలచిన జనం మెచ్చిన నేత.
తెలంగాణ ఉద్యమ సారధి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు దిండి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
అనంతరం బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గిరమోని శ్రీనివాస్ మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణను అభివృద్ధి చేసిన విధానాన్ని, రైతాంగాన్ని రైతులను అభివృద్ధి పదంలో నడిపించేందుకు చేసిన కృషిని కొనియాడారు. కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిండి పట్టణ బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు గిరమోని శ్రీనివాస్, ఉన్న లింగమయ్య, బల్ముల తిరుపతయ్య, నజీర్, రషీద్, t, చంద్రయ్య, మునగపాటి శ్రీనివాసులు, మహమ్మద్ జహంగీర్, ఖలీల్, కరీం, గుర్రం సురేష్, ఎం మల్లేష్ నాయక్, జైపాల్ నాయక్, లక్ష్మయ్య, జి శ్రీశైలం, రామస్వామి, రామచంద్రయ్య మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొని కెసిఆర్ జన్మదిన వేడుకలను జయప్రదo చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KCR birthday celebrations