TRINETHRAM NEWS
రాజశ్రీ చిత్తూరు జిల్లా S.P, శ్రీ P. జాషువ, IPS గారి ఆదేశాల మేరకు కర్ణాటక నుండి అక్రమంగా మద్యాన్ని చిత్తూరు పట్టణానికి తీసుకొని వచ్చి, ప్రజలకు ఎక్కువ రేటుకు  అమ్ముతున్న వ్యక్తులను పట్టుకొనుటకు గాను, వారిపై నిఘా వుంచి, చిత్తూరు, సబ్-డివిజినల్ పోలీసు ఆఫీసర్, శ్రీ M. రాజగోపాల్ రెడ్డి వారి పర్యవేక్షణలో ఈ రోజు అనగా 17-02-2024 వ తేదీ ఉదయం, కర్నాటక మద్యం అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారం మేరకు, చిత్తూరు II టౌన్ పోలీస్ స్టేషన్ C.I. K. ఉలసయ్య మరియు సిబ్బంది కలసి చిత్తూరు టౌన్, తేనెబండ, రాజీవ్ నగర్ కాలనీ సమీపంలోని నీవా నది ఏటివార గల ఆశ్రమం ప్రక్కన నిర్మాణంలో ఉన్న సెల్వి W/o పన్నీర్ సెల్వం అను ఆమె ఇంటి వద్ద రాజా అను వ్యక్తిని పట్టుకొని అతని వద్ద 2,20,000/- రూపాయలు(రెండు లక్షల ఇరవై వేలు) విలువ చేసే కర్నాటక మద్యం మరియు మద్యం అక్రమ రవాణాకు ఉపయోగించిన మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతనిని విచారించగా, అతను మరియు చిత్తూరు టౌన్, తేనెబండ, రాజీవ్ నగర్ కు చెందిన జయశంకర్ @ జ్యోతి అను అతనితో కలసి రాబోవు ఎలక్షన్స్ నిమిత్తం కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తీసుకొని వచ్చి, రాజీవ్ నగర్ లోని నీవా నది ఏటి ప్రక్కన గల సెల్వి అను ఆమె యొక్క నిర్మాణంలోని ఇంటిలో స్టాకు పెట్టి అమ్ముకుంటూ, అక్రమంగా అమ్ముతున్నట్లు చెప్పినాడు. అరెస్టు కాబడిన M. రాజా ను రిమాండుకు పంపడం జరుగుతుంది. 

పట్టుబడిన ముద్దాయి పేర్లు మరియు వివరాలు:

  1. M. రాజా, వయస్సు 36 సం.లు, తండ్రి. Late M.మునస్వామి, D.No:27-932/B, టెలిఫోన్ కాలనీ, చిత్తూరు టౌన్.

పరారీలో ఉన్న ముద్దాయి పేరు:

  1. జయశంకర్ @ జ్యోతి, రాజీవ్ నగర్, తేనెబండ, చిత్తూరు టౌన్,
    స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ వివరాలు:

 BANGALORE BRANDY, 180 M.L, మొత్తం 09 బాక్సులు, 432 ప్యాకెట్లు సుమారు (77 లీటర్లు), వాటి విలువ మొత్తం 80,000/- రూపాయలు.

 BANGALORE RUM, 180 M.L, మొత్తం 13 బాక్సులు, 624 ప్యాకెట్లు సుమారు (112 లీటర్లు), వాటి విలువ మొత్తం 1,00,000/- రూపాయలు

Total =22 బాక్సులు, 1056 ప్యాకెట్లు (179 లీటర్ల) కర్ణాటక మద్యం విలువ =1,80,000/- రూ.లు

 Yamaha కంపెనీ కి చెందిన Fazer మోడల్ గల మోటార్ సైకిల్ దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్: TN 19 Z 5560, Engine No: 21C1074038, Chassis No: ME121001X92074200 గా ఉన్నది.

సదరు మోటార్ సైకిల్ 40,000/- రూ.ల విలువ కలిగి ఉన్నది.

    పై తెలిపిన వారిపై చిత్తూరు II టౌన్ పోలీస్ స్టేషన్ నందు Cr.No.37/2024 U/Sec Sec.7r/w 8(b)(i)of AP Prohibition Act-1995 గా కేసు నమోదు చేయడమైనది. అరెస్టు కాబడిన ముద్దాయిని రిమాండుకు పంపడం జరుగుతుంది. ముద్దాయిని మరియు కర్ణాటక మద్యం ను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరచిన చిత్తూరు II టౌన్ ఇన్స్పెక్టర్ K. ఉలసయ్య మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ C. బాబు, కానిస్టేబుళ్ళు A. మధు, తవరాజ్,  సుధీర్ మరియు హోమ్ గార్డ్ నాగరాజు లను DSP గారు అభినదించడమైనది.