జూలై 16, 2026
TRINETHRAM NEWS
Karate Belt Certificates Awarded

Karate Belt : దేవరకొండ డివిజన్ జూన్ 15, త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే మరియు డాన్స్ సమ్మర్ క్యాంపు రెండు నెలలు నిర్వహించడం జరిగినది, ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కరాటే శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా బెల్టు గ్రేడింగ్ టెస్టు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ వీ టీ , డిండి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ రామారావు విచ్చేసి కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 15 సంవత్సరాల నుండి సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఎంతోమంది శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో పాల్గొన్నారు అని, క్రీడాకారులకు కళాకారులకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.

దేవరకొండ నియోజకవర్గం లో ఇంతవరకు ఇండోర్ అవుట్ డోర్ స్టేడియాలు లేకపోవడం దురదృష్టకరమని, పోలీస్ ఆర్మీ నావి రిక్రూట్మెంట్ కి ప్రాక్టీస్ చేయడానికి స్టేడియం లేకపోవడం వల్ల నల్గొండ హైదరాబాదు వెళ్లి శిక్షణ పొందడం జరుగుతుంది అని, అలాగే క్రీడాకారులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోవాలంటే స్టేడియం లేకపోవడం ఎంతో బాధాకరమని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ఇండోర్ అవుట్ డోర్ స్టేడియాల అందుబాటులోకి వచ్చేలాగా చూడాలని క్రీడాకారులను ఆదుకోవాలని అన్నారు.

విద్యార్థులకు ఎంతో అద్భుతమైన కరాటే శిక్షణ ఇస్తున్న మాస్టర్ గోపిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ల సురేష్ ,మాకం మహేష్, కరాటే మాస్టర్ గోపి, జగదీశ్వర్ చారి, ఎస్ వెంకన్న ,నారాయణ హెచ్ ఎం రామారావు, లక్పతి, బాలాజీ, రాజు, రహీం క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page