త్రినేత్రం న్యూస్, రాజమండ్రి… కాపు హక్కుల కోసం నిర్వహించనున్న ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు జాతికి చెందిన నాయకులు, ప్రముఖులు, యువత ఈ సభలో పాల్గొని ఐక్యతను చాటాలని ఆయన కోరారు.
ఈ ఆత్మీయ సభ మార్చి 8, 2026 ఆదివారం రోజున రాజమహేంద్రవరం నగరంలోని అర్బన్ కేఫ్ ఫంక్షన్ హాల్, ఆనాల వెంకట అప్పారావు రోడ్ (ఏవి రోడ్) లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఆహ్వాన కమిటీ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, అడ్వకేట్, సీనియర్ కాపు నేత వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అలాగే సీనియర్ కాపు నేత బలరాం నాయుడు సభలో పాల్గొననున్నారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాపు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేసి కాపు జాతి ఐక్యతను చాటాలని ఆహ్వాన కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


