మోడీ అండగా కందుల విజృంభణ

TRINETHRAM NEWS

Kandu boom under Modi

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అసెంబ్లీలో 57 వేల కాంగ్రెస్ మెజారిటీ ని కేవలం 6 నెలల్లో 10 వేలకు తగ్గించడం లో కీలక పాత్ర
6 నెలల కిందట

రామగుండం అసెంబ్లీ పరిధిలో వచ్చిన ఓట్లకు 4 రెట్లు ఈ ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కి పెరిగాయి. అసెంబ్లీ లో విజయం వరించకపోయినా కానీ మరుసటి రోజు నుండే ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలబడి ఉన్నారు.

అక్షింతల కార్యక్రమం, అయోధ్యా యాత్ర, పార్టీ పిలుపునిచ్చిన బస్సు యాత్ర, పెద్ద ఎత్తున చేరిక కార్యక్రమాలు, మోడీ కా పరివార్ కార్యక్రమాలు, ఉపాధి హామీ కూలీలతో మమేకం అవ్వడం ఇలా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి సందర్భాన్ని మీడియా, సోషల్ మీడియా ద్వారా నిరంతరం ఆక్టివ్ గా ఉంటూ భారతీయ జనతా పార్టీ ఉనికి ప్రజల్లో ప్రభావితం చేసేలా కష్టపడ్డారు
బీజేపీ కి వచ్చిన ఓట్లు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి అని మండల అధ్యక్షులు కందుల సంధ్యారాణి కి సన్మానం చేసి గోదావరిఖని చౌరస్తా లో బాణసంచా కాల్చి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ శ్రీరాముడిలా మోడీ మా వెన్నంటి ఉండగా రాముని బంటుల్లాగా ప్రతి గడపగడపకి కార్యకర్తలు కాషాయ సైన్యం వలె ఉధృతంగా ప్రచారంలో పాల్గొన్నారు దాని ఫలితమే ఈ ఓట్లు. ఆరు నెలల్లో అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు భరోసా ఇచ్చే ఏ పథకం అమలు చేయకపోవడం మాకు పెద్ద లాభాన్ని చేకూర్చింది.

అది కాంగ్రెస్ మీద వ్యతిరేకతను పెంచి తెరాస వైపు మరలకుండా బిజెపి వైపు ప్రజలు చూసేలా చేయడంలో ఇంతటి విజయం సాధించడానికి కృషి చేసిన సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, మండల ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, బూత్ కోఆర్డినేటర్, బూత్ ఏజెంట్లు ముఖ్యంగా కార్యకర్తలు నా ధన్యవాదములు. దాదాపు 65 బూతులలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి.

ఈ ఉత్సాహంతో ఇంకా పెద్ద ఎత్తున పనిచేయడానికి ప్రేరణ కలిగింది. రేపటి నుండి మా కార్యాచరణ పూర్తిగా ప్రభుత్వ పథకాల అమలుపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుంది అని కందుల సంధ్యారాణి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హన్మంతు గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గాండ్ల ధర్మపురి, సీనియర్ నాయకులు సుల్వ లక్ష్మీనర్సయ్య, కోమల మహేష్, తోట కుమార స్వామి, పార్లిమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ సుమంత్ పటేల్, అసెంబ్లీ కో ఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, గుండబోయిన భూమయ్య, కొమ్ము గట్టయ్య, బాణాల స్వామి, నవీన్ గౌడ్, మిట్టపల్లి సతీష్ కార్యకర్తలు మెరుగు శ్రీనివాస్, గంధ అజయ్, దాసరి ఉషాలు, మామిడి వీరేశం, రాజ్ కుమార్, అపర్ణ, సంపూర్ణ, పవన్, మహేందర్, శ్రీనివాస్ యాదవ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kandu boom under Modi

You cannot copy content of this page

Scroll to Top