
Trinethram News : హన్మకొండ జిల్లా:మార్చి 09
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందిం చారు. శనివారం ఉదయం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ..
బీఆర్ఎస్‌లో తనకు గుర్తిం పు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో ఎన్నో అవమానాలు ఎదు ర్కొన్నా అని భావోద్వేగానికి గురయ్యారు.
ఐదేళ్ల పాటు రాజకీయంగా నన్ను అడ్డుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. ప్రస్తు తం నన్ను ఒక జాతీయ పార్టీ గుర్తించిందని అన్నారు.
కిషన్ రెడ్డి తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. రామప్పకు జాతీయ హోదా తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.
ఇక నేను నిర్ణయం తీసుకు న్నాను. నన్ను గుర్తించే పార్టీలోనే చేరుతా’ అని ప్రకటించారు. మహబూ బాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు ఈ సంద ర్భంగా మనసులో మాట బయటపెట్టారు.
కాగా, శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటిం చిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో ఆయన హన్మ కొండలోని సీతారాం నాయక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
బీజేపీలోకి రావాలని ఆహ్వా నించారు. అనుచరులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సీతారాం నాయక్ చెప్పారు. సీతారం నాయక్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును కూడా బీజేపీ నాయకులు కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్టు సమా చారం…
