కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మార్వో రవీందర్ కలిసి పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నిజమైన శాసనసభ్యులు రాజ్ ఠాకూర్

TRINETHRAM NEWS

కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మార్వో రవీందర్ కలిసి పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నిజమైన శాసనసభ్యులు రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కళ్యాణ లక్ష్మి & షాది ముభారక్ చెక్కులు ఎమ్మార్వో అధికారులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్రై తులు పండించిన ప్రతి గింజను కటింగ్ లేకుండా కొనుగోలు చెపించే బాధ్యత మీ రాజన్నది సన్న వడ్లకు ₹ 500 /- రూపాయల బోనస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అంతార్గం మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం రోజున వివిధ గ్రామాలకు చెందిన 9 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాది ముభారఖ్ లబ్ధిదారులకు రూ. 9లక్షల 10,44 విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో మరియు అధికారులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్

ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకుర్తి మండలం సంబంధించి 2వ సారి కల్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను పంపిణి చేయడం జరుగుతుందని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీలను దశల వారిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్,ఆరోగ్య శ్రీ 10 లక్షలు, 500/- గ్యాస్, ఇవ్వడం జరుగుతుంది

బిఆర్ఎస్ నాయకులు రైతు రుణమాఫీ జరగలేదని, రైతుబంధు ఇవ్వలేదని కేటీఆర్ పిలుపు ఇవ్వడంతో, ఆయన తాబేదారులు అక్కడక్కడ ధర్నాలు చేశారని అన్నారు. ధర్నాలు చేసే “ముందు ఒక్కసారి ఆలోచించాలని, గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు రైతు రుణమాఫీ చేస్తామని, మోసం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే 70 శాతం పైగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు.

గతంలో వారి ప్రభుత్వ హయంలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కై క్వింటాలకు 10 నుండి 20 కిలోల వడ్ల కటింగ్ చేసిన బిఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి, మోసం చేసి, పారిపోయే పార్టీ కాదని, ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రైతు భరోసాను అందిస్తామని, సన్న వడ్లకు ఈ సీజన్ నుండే ₹ 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ అని అన్నారు.

అనంతరం లబ్ధిదారులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ఆంతర్గం మండల తహసీల్దార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top