జూన్ 26, 2026
TRINETHRAM NEWS

రావులపాలెం డిపో మేనేజర్ కుమార్.

Trinethram News : “ఆషాడ మాసం అష్ట దేవీ ల దర్శనం” పేరుతో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం లాభదాయకంగా ఉందని అందులో కడియం మండలం కడియపులంక శ్రీ పుంతలో ముసలమ్మవారి ఆలయ దర్శనం ఎంతో కీలకంగా మారిందని రావులపాలెం ఆర్టీసీ డిపో మేనేజర్ వైవి కుమార్,అసిస్టెంట్ మేనేజర్ అచ్యుతాంబ లు తెలిపారు. ఆషాడ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో పది బస్సులు ల్లో భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులతో పాటు ఈ ఆర్టీసీ అధికారులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయాల దర్శనంలో చివరగా శ్రీ పుంతలోముసలమ్మవారి దర్శనం ఉందని ఇక్కడ ఆలయ నిర్వాహకులు భక్తులను ఎంతగానో ఆదరించారన్నారు.రాత్రి పది దాటిన తర్వాత ఇక్కడకు బస్సుల్లో భక్తులు వచ్చినప్పటికి ఆ సమయంలో అమ్మవారి దర్శనంతో పాటు టిపిన్లు ఏర్పాటు చేయడం ద్వారా భక్తుల ఆదరాభిమానాలు చూడగొన్నారన్నారు.వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడం లో రావులపాలెం ఆర్టీసీ డిపో ముందంజలో ఉందని వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kadiyapulanka Musalamma temple visit

You cannot copy content of this page