
కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
Junior Assistant Receives Award : వికారాబాద్ త్రినేత్రం న్యూస్ జిల్లా ప్రతినిధి జూన్ 2 :- వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కె. పరమేష్‌కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారం లభించింది. విధుల నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, అంకితభావం, ప్రజలకు అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు.
జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చేతుల మీదుగా కె. పరమేష్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, సహోద్యోగులు ఆయనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అవార్డు అందుకోవడం పట్ల కె. పరమేష్ హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే నిబద్ధతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ పురస్కారం తనకు మరింత ఉత్సాహాన్ని, బాధ్యతను పెంచిందని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
