Additional SP : సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం

TRINETHRAM NEWS

యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు.

ఆంధ్రప్రదేశ్ (అనకాపల్లి) త్రినేత్రం న్యూస్ మే 17: సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వారధిగా వారి పాత్ర ప్రశంసనీయం అని అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ (యూజెఎఫ్) అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ సారథ్యంలో రూపొందించిన డైరీ, పాకెట్ బుక్‌ను శుక్రవారం ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలపై యూజెఎఫ్ తీసుకుంటున్న చొరవ అభినందనీయం అన్నారు. వార్తలు రాసే మేరకే జర్నలిస్టులు తమ కర్తవ్యంలో ముగించుకోక, ప్రశ్నించలేని ప్రజల గొంతుగా నిలుస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని అన్నారు.
యూజెఎఫ్ విశాఖ యూనిట్ అధ్యక్షుడు, ఏపియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కే. రాము మాట్లాడుతూ, అధ్యక్షుడు డాక్టర్ వర్మ గత దశాబ్దకాలంగా జర్నలిజం రంగంలో సామాజిక స్పృహతో నిర్వహిస్తున్న సేవలను వివరించారు.
ఈ కార్యక్రమంలో యూజెఎఫ్ సమన్వయకర్త డి. హరనాథ్, అనకాపల్లి జిల్లా జర్నలిస్టులు భీమరశెట్టి వెంకటేష్, షేక్ షాంద్ భాష, కాండ్రేగుల మోహన్ బాబు, పైలా రామారావు, బయ్యా కొండలరావు, ఈ షణ్ముఖ, మోల్లేటి గంగాధర్, గంటా శ్రీనివాసరావు, పొలిమేర నాగశ్రీను, కోరుబిల్లి గణేష్, సింగర్ రాజు, బోని గణేష్, వై. నాగు, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Journalists' goal is the

You cannot copy content of this page

Scroll to Top