జయప్రద మిస్సింగ్..! ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

TRINETHRAM NEWS

JayaPrada: జయప్రద మిస్సింగ్..! ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

సినీ నటి జయప్రద కనిపించడం లేదు.. అవును మీరు విన్నది నిజమే ఆమె మిస్ అయ్యిందని పోలీసులు వెతుకుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. జయప్రద పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది కోర్టు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రూల్స్ ను అతిక్రమించిన కేసులో జయప్రద పై కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఇప్పటికే చాలా సార్లు ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఆమె హాజరుకాలేదు. దాంతో ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది కోర్టు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉంది. దాంతో ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నవంబర్‌ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉంది కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఆతర్వాత కేసును నవంబర్‌ 17కు వాయిదా వేసింది కోర్టు.. అయినా కూడా ఆమె కోర్టుకు హాజరుకాలేదు. డిసెంబర్‌ నెలలో హాజరు కావాలని జయప్రదకు సీరియస్ వర్నింగ్ ఇచ్చింది కోర్టు.

అయినా కూడా ఆమె లెక్క చేయలేదు. ఎట్టిపరిస్థితుల్లో జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. దాంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాంతో జయప్రద కోసం పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. దాంతో ఆమెను కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పుడు ఇదే న్యూస్ కోలీవుడ్ లో వైరల్ గా మారింది.

You cannot copy content of this page

Scroll to Top