WhatsApp Image 2024 01 24 at 1.49.02 PM
Trinethram News : హైదరాబాద్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి ‘జయ జయహే తెలంగాణ’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో కుమురం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారులు జానపదాలను ప్రదర్శించనున్నారు. దిల్లీలో మంగళవారం శకట ప్రదర్శనకు సంబంధించి పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్ నిర్వహించారు.
