జనవరి 2025 లో స్కూళ్లు, కాలేజీలకు భారీ సెలవులు… ఎన్నిరోజులో తెలుసా..!!
Trinethram News : తెలంగాణలో విద్యాసంస్థలకు వరుస సెలవులు వస్తున్నాయి. క్రిస్మస్ సెలవులు ముగియగానే న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా సెలవులే సెలవులు. వచ్చే నెల జనవరిలో మొత్తం ఎన్నిరోజుల సెలవులు వస్తున్నాయంటే…
కొద్ది రోజుల్లో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఎవరి సంగతి ఎలావున్నా స్కూల్, కాలేజీ విద్యార్థులకు మాత్రం 2024 చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో సాధారణ సెలవులతో పాలు ప్రకృతి వైపరిత్యాల కారణంగా కూడా భారీగా సెలవులు వచ్చాయి. భారీ వర్షాలు, వరదలతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులే సెలవులు వచ్చాయి. ఇలా అధికంగా సెలవులు వచ్చిన సంవత్సరాన్ని స్టూడెంట్స్ ఎలా మరిచిపోగలరు.
అయితే ఈ ఏడాది సెలవుల పరంపరం వచ్చేఏడాదిలో కూడా కొనసాగుతుందా? అంటే జనవరి, 2025 లో సెలవులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ నెలలో మొత్తం 31 రోజులుంటే అందులో తొమ్మిదిరోజులు సెలవులే. అంటే స్కూళ్లు, కాలేజీలు నడిచేది కేవలం 22 రోజులు మాత్రమే. ఇది విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త. వచ్చేనెలలో ఏ రోజు సెలవు వుంది? ఎందుకోసమో తెలుసుకుందాం.
వచ్చే ఏడాది ఆరంభమే సెలవులతో ప్రారంభం అవుతోంది. జనవరి 1, 2025 (బుధవారం) నూతన సంవత్సరాది సందర్భంగా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఆరోజు విద్యార్థులు స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు… కుటుంబంతో లేదంటే స్నేహితులతో హాయిగా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవచ్చు. అయితే ఈరోజుకు బదులు జనవరి 11 రెండో శనివారం సెలవులు రద్దుచేసారు. ఆ రోజు విద్యాసంస్థలు యదావిధిగా నడుస్తాయి.
ఇక సరిగ్గా ఈ నెల మధ్యలో సంక్రాంతి పండగ సందర్భంగా సెలవులు వస్తున్నాయి. ఈ సెలవులకు ఆదివారం కలిసిరావడంతో లాంగ్ వీకెండ్ వస్తోంది. జనవరి 13 సోమవారం భోగి, జనవరి 14 మంగళవారం సంక్రాంతి సెలవు. ఆ తర్వాతిరోజు జనవరి 15 కనుమకు ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. అదేరోజు హజ్రత్ అలీ బర్త్ డే సందర్భంగా కూడా విద్యార్థులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ సర్కార్.
ఇలా జనవరి 12 నుండి 15 వరకు వరుసగా నాలుగు రోజుల సెలవులు వచ్చాయి. ఈ సెలవులు హైదరాబాద్ లో వుండే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకునే ఆ ప్రాంత ప్రజలు సొంతూళ్లకు వెళ్లిరావడానికి ఈ సెలవులు కలిసివస్తాయి. ఇలా వారు సొంతూల్లో సొంతోళ్లతో కలిసి హాయిగా సంక్రాంతి జరుపుకోవచ్చు.
ఇలా సంక్రాంతి సెలవుల తర్వాత ఇదే జనవరిలో మరో సెలవు వస్తుంది. షబ్-ఈ-మేరాజ్ సందర్భంగా తెలంగాణ విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. అంటే ఆరోజు కూడా కావాలనుకుంటే విద్యార్థులు సెలవు తీసుకోవచ్చు. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున జాతీయ సెలవు. అయితే ఆరోజు ఆదివారం కావడంతో సాధారణ సెలవుతో కలిసిపోయింది.
సాధారణంగా ప్రతి ఆదివారం విద్యాసంస్థలకు సెలవు వుంటుంది. ఇలా జనవరిలో కూడా 5,12,19,26 తేదీల్లో సాధారణ సెలవు వుంది… ఈ నాలుగురోజులు విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం వుండదు. వీటికి న్యూ ఇయర్, సంక్రాంతి పండగ, షబ్-ఈ-మేరాజ్ సెలవులను కలిపితే మొత్తం తొమ్మిది రోజులు సెలవులు వస్తున్నాయి.
అయితే జనవరి 15 న కనుమ, హజ్రత్ అలీ బర్త్ డే ఒకేరోజు వస్తున్నాయి. ఇక జనవరి 26 రిపబ్లిక్ డే కూడా సెలవురోజైన ఆదివారం వస్తోంది. ఇక రెండో శనివారం హాలిడేనే పనిదినంగా ప్రకటించడంతో మరో రోజు సెలవు మిస్సయ్యింది. ఇలా తెలంగాణ విద్యార్థులకు జనవరి 2025 లో మరో మూడురోజుల హాలిడేస్ మిస్సయ్యాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App