అల్లూరి జిల్లా పాడేరు తినేత్రం న్యూస్ మే13: అల్లూరిజిల్లా (పాడేరు) నియోజకవర్గంలోని సేరుబయలు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కిల్లో అశోక్ కుమార్‌కు అంతిమ వీడ్కోలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య, పార్టీ నాయకులు, వీరమహిళలు పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వంపూరు గంగులయ్య మాట్లాడుతూ, కిల్లో అశోక్ కుమార్ మరణం పార్టీకి తీరని లోటని, ఆయన పార్టీ అభివృద్ధి కోసం తొలి నుంచి అహర్నిశలు శ్రమించిన సేవలు అమూల్యమైందని అన్నారు. ఆయన కుటుంబానికి జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కిల్లో అశోక్ కుమార్ పార్టీ కార్యకలాపాల్లో కుటుంబ సభ్యులతో పాటు చురుకుగా పాల్గొన్నవారని, జనసేన కుటుంబంలో ఆయన ఓ స్ఫూర్తిదాయక కార్యకర్తగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. అనంతరం ఆయన పార్థీవదేహానికి పూలమాలలు వేసి, చితికి కర్రలు వేసి పార్టీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో జనసేన విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, ఐటీ ఇంచార్జ్ సాలేబు అశోక్, ఐటీ టీమ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.అనిల్ కుమార్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీ కృష్ణ, ఉపాధ్యక్షులు ఏస్. భూపాల్, మాడుగుల సీనియర్ నాయకులు మసాడి సింహాచలం, మండల నాయకులు మజ్జి సత్యనారాయణ, కుంచె దేవేంద్ర ప్రసాద్, వంపూరు రమేష్, మజ్జి సంతోష్, చందు తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు, శ్రేయోభిలాషులు, జనసేన కార్యకర్తల మధ్య కన్నీటి వీడ్కోలు జరగడం భావోద్వేగానికి గురిచేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


