Janasena : 79వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 15 : జనసేన పార్టీ కుకట్పల్లి నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్, టీటీడీ బోర్డు మెంబర్ బొంగునూరు మహేందర్ రెడ్డి, స్టేట్ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ మరియు, సీనియర్ నాయకులు రామ్ తల్లూరి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సాగర్, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్,హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్, సాగర్, ప్రేమ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకొని, యువత దేశాభివృద్ధిలో ముందుండి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జాతీయ పతాకావిష్కరణ అనంతరం దేశభక్తి గీతాలు ఆలపించబడగా, స్థానికులు మరియు పార్టీ కార్యకర్తలు దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, వీరమహిళా విభాగం చైర్మన్ మండపాక కావ్య, జనరల్ సెక్రెటరీ శిరీష కోట, కోదాడ ఎంఎల్ఏ కంటెస్టెడ్ సతీష్ రెడ్డి, ఖమ్మం ఎంఎల్ఏ కంటెస్టెడ్ రామకృష్ణ, వైస్ చైర్ పర్సన్ నిహారిక నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ లికిత, పటాన్చెరువు రీఛార్జ్ రాజేష్, కొత్తగూడెం ఇంచార్జ్ కార్తీక్, శేర్లింగంపల్లి ఇంచార్జ్ మాధవ రెడ్డి, కొత్తగూడెం మరియు జనసేన నాయకులు , వీర మహిళలు మరియు జనసేన కార్యకర్తలు తధితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

79th Independence Day Celebrations:

You cannot copy content of this page

Scroll to Top