జూలై 16, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి డిసెంబర్ 1 (త్రినేత్రం న్యూస్) : అదివారం లోధా అపార్ట్మెంట్ దగ్గర క్రికెట్ గ్రౌండ్ లో జనసేన నాయకుల యాక్టివ్ ఫిట్నెస్ టెస్ట్ – ఆదివారం ఆటవిడుపు కార్యక్రమాన్ని జనసేన నాయకులు పోలేబోయిన శ్రీనివాస్ నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ లకు ముఖ్య అతిథిగా పాల్గొన కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మ్యాచ్ టాస్ వేసి ప్రారంభించారు .

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ జనసేన నాయకులకు ఇలాంటి ఆటవిడుపు కార్యక్రమాలు టీమ్ వర్క్, టీమ్ స్పిరిట్, బాడీ యాక్టివిటీస్ కి, మేనేజ్‌మెంట్, డిసిప్లిన్ మరియు నాయకత్వ లక్షణాలను మరింతగా అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. యువతలో ఫిట్నెస్‌పై అవగాహన పెంచే దిశగా జనసేన నాయకులు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders should work towards developing leadership qualities

You cannot copy content of this page