TRINETHRAM NEWS

జేఏసీ సభ్యులు. – ఎస్. అశోక్ లాల్.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లో ఐటీడీఏ ద్వారా జీడి మామిడి పిక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతీ సంవత్సరం దళారీల చేతులలో మోషపోతున్న జీడి మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని రైతులు ఎన్ని సార్లు గొంతు ఎత్తిన అదికారులు ,ప్రజా ప్రతినిదులు పట్టించుకునే పరిస్థితిలో లేరు.

ఇదే అదునుగా మండలఅదికారులు, వ్యాపారులు సిండికేట్ అయి రైతులను నిలువునా దోసుకుంటున్నారు. మొదట్లో 80 కేజీలు జీడి పిక్కలు 13 వేల రూపాయలు మద్దతు ధర ఉండగా గత వారం దళారులందరూ రహస్య ప్రదేశంలో సమావేశమై 13 వేల రూపాయలు ఉన్న మద్దతు ధరను తగ్గించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇంకా రేటు తగ్గిపోతుంది అంటూ రైతులను భయభ్రాంతులను గురి చేస్తూ తక్కువ రేటు కొనుగోలు చేస్తున్నారని, కేజీ 150 రూపాయలు ఉండగా తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పంట దిగుబడి లేక గిట్టుబాటు మద్దతు ధర దళారులు రానివ్వక జీడిమామిడి రైతాంగం అప్పులు తీరని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

పెట్టుబడి వడ్డీలు కట్టలేని పరిస్థితిలో జీడిపిక్కల రైతాంగం రంపచోడవరం నియోజక వర్గంలో ఐటీడీఏ ద్వారా జీడి మామిడి పిక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి జీడి మామిడి పిక్కలు కేజీ 150 రూపాయిల కు కొనుగోలు చేస్తూ రైతుకు గిట్టుబాటు ధరలు అందిస్తున్న, పాడేరు ఐటీడీఏ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తక్షణమే మండల కేంద్రంలో జీడి మామిడి పిక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదివాసి జే ఏ సి జిల్లా కమిటీ సభ్యులు ఎస్.అశోక్ లాల్ ఒక డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ITDA should set up